పంచాయతీ కార్యదర్శులసమస్యలకు త్వరలోనే చెక్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

పంచాయతీ కార్యదర్శులసమస్యలకు త్వరలోనే చెక్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా కృషి చేయనున్నట్టుగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్(టీపీఎస్ఎఫ్) రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, తెలంగాణ త‌‌‌‌హ‌‌‌‌సీల్దార్స్ అసోసియేష‌‌‌‌న్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌‌‌‌.రాములు, గ్రామ పాల‌‌‌‌నా అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గ‌‌‌‌రికె ఉపేంద్రరావు పాల్గొన్నారు.

టీపీఎస్​ఎఫ్​ స్టేట్ ప్రెసిడెంట్ ఏ.శ్రీకాంత్ గౌడ్,  జ‌‌‌‌నరల్ సెక్రటరీ ఎన్​ నాగరాజు, ట్రెజరర్​ఎం. శశిధర్, గౌరవ అధ్యక్షులు ఎం. సందీప్ ప‌‌‌‌లు స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ను ప్రస్తావించారు. ఓపీఎస్ ద్వారా వచ్చిన పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాల‌‌‌‌ని కోరారు. ఇదే కాకుండా వాళ్లు పని చేసిన  కాలాన్ని కూడా ప‌‌‌‌రిగ‌‌‌‌ణ‌‌‌‌నలోకి తీసుకొని రెగ్యులర్ చేయాలన్నారు.

న్యాయ‌‌‌‌బ‌‌‌‌ద్ధమైన ప్రతి డిమాండ్‌‌‌‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌‌‌‌రిష్కారం అయ్యే విధంగా కృషి చేయ‌‌‌‌నున్నట్టుగా ఈ సంద‌‌‌‌ర్భంగా ల‌‌‌‌చ్చిరెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో రెవెన్యూ, పంచాయ‌‌‌‌తీరాజ్ విభాగాలు స‌‌‌‌మ‌‌‌‌న్వయంతో ప‌‌‌‌ని చేయాల‌‌‌‌ని సూచించారు. అప్పుడే ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు కావాల్సిన సేవ‌‌‌‌లు అంద‌‌‌‌డంతో పాటు అభివృద్ధి కూడా జ‌‌‌‌రుగుతుంద‌‌‌‌న్నారు.